గరికపూలవనం - ఎడ్ల . లక్ష్మి
ఎడ్ల . లక్ష్మి
అంశం .గరికపూలవనం
కవిత . సంఖ్య.165
శీర్షిక : ఎంతో ఇష్టం
*********
పొలం గట్టు పైనా పచ్చగా
అందంగా ఎదుగును
ఆ గరిక పశువులకు
ప్రీతికరమైన మేత
ఆవనికి అది పచ్చని కోక
చిన్న చిన్న మొగ్గలు వేసి
నిత్యం పూయును
ప్రకృతి అందం తప్ప
మనిషి గుణ గణము తెలవని
అమాయకమైన గడ్డి మొలక
ఎవరు దాన్ని చూడకున్నా
ఆకాశాన్ని చూస్తూ ఎండ తో
వానతో చెలిమిగా వుండును
ఏ పూజకు ఆ పూలను
వాడకున్నా అదే రాలి
భూమాత పాదాలమీద వాలి
మురుస్తుంది ఆ గడ్డి పువ్వు
ఏ పూజకు పనికి రాదంటారెందుకు
పచ్చటి గరికపోసలంటే
గణపయ్యకు ఎంతో ఇష్టం
అంశం .గరికపూలవనం
కవిత . సంఖ్య.165
శీర్షిక : ఎంతో ఇష్టం
*********
పొలం గట్టు పైనా పచ్చగా
అందంగా ఎదుగును
ఆ గరిక పశువులకు
ప్రీతికరమైన మేత
ఆవనికి అది పచ్చని కోక
చిన్న చిన్న మొగ్గలు వేసి
నిత్యం పూయును
ప్రకృతి అందం తప్ప
మనిషి గుణ గణము తెలవని
అమాయకమైన గడ్డి మొలక
ఎవరు దాన్ని చూడకున్నా
ఆకాశాన్ని చూస్తూ ఎండ తో
వానతో చెలిమిగా వుండును
ఏ పూజకు ఆ పూలను
వాడకున్నా అదే రాలి
భూమాత పాదాలమీద వాలి
మురుస్తుంది ఆ గడ్డి పువ్వు
ఏ పూజకు పనికి రాదంటారెందుకు
పచ్చటి గరికపోసలంటే
గణపయ్యకు ఎంతో ఇష్టం
Comments
Post a Comment