గరిక పూలు - లక్ష్మి మదన్
లక్ష్మి మదన్
నేటి కవిత :141
అంశం : గరిక పూలు
శీర్షిక : వాడని ( వాడి పోని) పూలు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఉషోదయ వేళ లో
పచ్చని గరిక తివాచీ పై
తుషార బిందువులు ముత్యములై..
మెరుపు లీనుతు ఉంటే...
పాదాలకి సుతి మెత్తగా తాకుతూ చల్ల బరుస్తుంటే.......
ఎంత అద్భుతం ఆ భావన!
అక్కడక్కడ రత్నాలు పొదిగిన ట్లు గా
ఆకు పచ్చని చీర పై మెరిసే గరిక పూలు
ఎంత శోభాయమానం ప్రకృతి!
పూజకి పనికి రాక పోతెనేమి!
ముదితల వాల్జడ లో నిలవక పోతే నేమి!
అంతులేని సౌందర్యాన్ని ఒలికిస్తూ
ఎనలేని స్పందన ని కలుగ జేస్తున్న..
గడ్డి పూలది ఎంత భాగ్యం!
ఎండకి సైతం వాడి పోకుండా..
వానకి సైతం నేల రాల కుండా
ధీటుగా ధాటిగా నిలబడ్డ.....
గిరిజన పల్లె పడుచు వోలె...
మనోహరంగా మురిపిస్తు ఉన్నాయి
అడవుల్లో సావాసమైన పడతులు
కష్టం తో సాధించిన పటుత్వం..
నాగరిక పు వాసన తగలని స్వచ్ఛత తో
మంచి ముత్యమంటి మనసు తో..
నాకు గరిక పూలల్లే అందంగా సాక్షత్క రిస్తున్నారు!
నేటి కవిత :141
అంశం : గరిక పూలు
శీర్షిక : వాడని ( వాడి పోని) పూలు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఉషోదయ వేళ లో
పచ్చని గరిక తివాచీ పై
తుషార బిందువులు ముత్యములై..
మెరుపు లీనుతు ఉంటే...
పాదాలకి సుతి మెత్తగా తాకుతూ చల్ల బరుస్తుంటే.......
ఎంత అద్భుతం ఆ భావన!
అక్కడక్కడ రత్నాలు పొదిగిన ట్లు గా
ఆకు పచ్చని చీర పై మెరిసే గరిక పూలు
ఎంత శోభాయమానం ప్రకృతి!
పూజకి పనికి రాక పోతెనేమి!
ముదితల వాల్జడ లో నిలవక పోతే నేమి!
అంతులేని సౌందర్యాన్ని ఒలికిస్తూ
ఎనలేని స్పందన ని కలుగ జేస్తున్న..
గడ్డి పూలది ఎంత భాగ్యం!
ఎండకి సైతం వాడి పోకుండా..
వానకి సైతం నేల రాల కుండా
ధీటుగా ధాటిగా నిలబడ్డ.....
గిరిజన పల్లె పడుచు వోలె...
మనోహరంగా మురిపిస్తు ఉన్నాయి
అడవుల్లో సావాసమైన పడతులు
కష్టం తో సాధించిన పటుత్వం..
నాగరిక పు వాసన తగలని స్వచ్ఛత తో
మంచి ముత్యమంటి మనసు తో..
నాకు గరిక పూలల్లే అందంగా సాక్షత్క రిస్తున్నారు!
Comments
Post a Comment