గరిక పూల వనం - ఉదయశ్రీ ప్రభాకర్

పేరు. ఉదయశ్రీ ప్రభాకర్
కవిత సంఖ్య.246
అంశం.గరిక పూల వనం

గరిక పూల వనం..

పుడమి తలంపై అందాలను
ఒలికించి ప్రకృతికి శోభ నద్దుతాయి సుమ వనాలు
చూపులను చూరగొంటూ మురిపిస్తాయి కొన్ని
పరిమళాలు వెదజల్లి మనసును మురిపిస్తాయి కొన్ని

మగువ సిగన చేరి సింగారాలు  ఒలకపోసే సుమాలు కొన్ని
మగువ జడన చేరి మాలగ ఊయల ఊగుతూ హొయలు పోతాయి కొన్ని..
దైవం పాదాల చెంత చేరి కొన్ని సుమాలు తరిస్తే
సైనికుల పార్ధీవ దేహంపై వాలి జన్మ సార్ధకం చేసుకొనే సుమాలు కొన్ని..

గరిక పూల వనాలు చూపులను చూరగొంటూ
ఆనందాల విందుచేస్తాయి మనసుకు..
జీవించేది ఒక్కనాడే అయినా
ఎగురవేసిన విజయ కేతనంలా
పుడమికి పెట్టిన కీర్తి కిరీటం లా
నిలిచి ఉంటుంది నిండు గంభీర రూపమై
ఎండకు కనుమరుగైనా..
చిరు చినుకు తాకగానే ఉనికిని చాటుకుంటుంది ..జగతిలో తనూ ఓ బాగం అంటూ

ఉదయశ్రీ ప్రభాకర్
19.06.19

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి