గరిక పూల వనం - కాసనగొట్టు స్వప్న

కాసనగొట్టు స్వప్న.
అంశం: గరిక పూల వనం
శీర్షిక: గరిక పువ్వులమే
కవితసంఖ్య: 225

***********

తొలకరి చినుకుల మమతలు ధరణి తనువును తాకి చుంబించగనే
అవనికి హరిత చీరను చుట్టే గరిక వనాలమే..

కొద్దిపాటి జల్లులకే సంతృప్తి పడుతూ
 కోకొల్లలుగా పుట్టుకొచ్చే నిరాడంబర తృణాలమే...

సంపన్నపు సౌరభాలు వెదజల్లే వివిధవర్ణ కుసుమాలం కాకున్నా..
దారికిరువైపులా నిలిచే గుర్తింపులేని ప్రాణులమే..

పూజకు పనికిరాని  పువ్వులనివ్వకపోయినా...
అగ్రపూజలందుకునే గణనాయకుని మెడలో హారాలమే...

మాపై నడిచే పాదాలకు మెత్తలమై రక్తప్రసరణకు తోడ్పడడమేకాదు...
మన్నుతిన్న పాములు మాలో దాగుంటాయని హెచ్చరించే హితులం కూడా...

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి