పత్రహరితం - విఠాలశ్రీకాంతశర్మ

పేరు. విఠాలశ్రీకాంతశర్మ
అంశం.పత్రహరితం
కవితసంఖ్య .
శీర్షిక.సతతహరితం
తేది 20-06-2019
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పత్రహరితం వృక్షానికి అందం
పచ్చనిచెట్లు ప్రకృతికి అందం
పచ్చదనం నిర్మూలించే వికృత
మనస్తత్వం ప్రకృతికి శాపం
ఎదగనిచ్చేమనసు ఎదకాల్చేస్తుంటే....
సొగసైనచిగుళ్ళను గోళ్ళతోచిమ్మేస్తుంటే....
కట్టెనే కామరూపంలో గొడ్డలిలో
చొరబడి స్వజాతి నిర్మూలనకు
తెగబడుతుంటే.....
కూర్చున్నకొమ్మను నరికేసుకొనే
మూర్ఖతనుయావత్ మానవజాతిసంతరించుకొంటే..
పత్రాలెక్కడ పత్రహరితమెక్కడ......
స్వార్థపురంపాలకు బలౌతున్న
మహావృక్షాలస్థానానికి
మరుగుజ్జు పొదలనుప్రత్యామ్నాయంగాచూపే జాతి సతతహరితాన్ని
సాధించగలదా.......
చిరుగులేని ఆకుపచ్చ చీర
ధరణీమాతకు కట్టించగలమా...
సతతహరితవృక్షభరిత
భూమాతను చూడగలమా
ఆశబారెడు అమలుజానెడు

విఠాలశ్రీకాంతశర్మ
సిద్ధిపేట

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి