పత్రహరితం - మాధవీసనారా
అంశం:పత్రహరితం - మాధవీసనారా
శీర్షిక:పెరగాలి కోట్లు
కవిత సంఖ్య:164
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
చెట్టులో నాకొక తపస్సు చేసుకునే మునే కనిపిస్తాడు
ఒక సజీవ వంశమే గోచరిస్తుంది
ప్రతి చెట్టూ ఒక పెద్ద కుటుంబం
అది ఆకులహరితంతో
కళ్ళకి ఆహ్లాదాన్ని అందిస్తుంది
చెట్టున్న చోటు ఆనందాలకు నెలవు
చెట్టుపిల్లలున్న అడవి సరే
పల్లె అయినా పట్టణమైనా నగరమైనా ఎంత అదృష్టం చేసుకునుండాలి
చెట్టుపిల్లలు లేని ఎడారి దురదృష్టవంతురాలే
పచ్చదనం ఊపిరిపీల్చే చెట్టుకు
ఆకులే స్వర్ణ సర్వాభరణాలు
వాటికి పచ్చదనమే మెరుగు
చెట్టుకు భూమే తల్లి
సూర్యుడే తండ్రి
ఆహారం సమకూర్చే తల్లిదండ్రుల రక్షణలో ఉండే చెట్లు
తమకు చేటు చేసినవారిని సైతం
చాటుగానైనా దూషించని చెట్లు
పెరగాలి కోట్లు కోట్లు
మాధవీసనారా, అనకాపల్లి
విశాఖపట్టణం జిల్లా
Comments
Post a Comment