పత్ర హరితం -రాయవరపు సరస్వతి
కవిత సంఖ్య: 204
అంశం: పత్ర హరితం -రాయవరపు సరస్వతి
శీర్షిక: పచ్చని హారం
********
"చెట్లను నాటితే క్షేమం,
నరికితే క్షామం,
నీ రక్షణ కవచాన్ని నిన్ను నువ్వే
భక్షించుకుంటున్నావు,
ఇప్పటికైనా కళ్ళు తెరిచి
ఇంటిముందు తులసి మొక్క
ఇంటివెనుక వేప, జామి, అరటి,కొబ్బరి, చెట్లను నాటి
పెరటిని ఆహ్లాదకరంగా,
పత్ర హరితంగా తీర్చిదిద్దు,
రకరకాల పోషకాలతో
ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకో,
ఆరోగ్యమేకదా మహా భాగ్యం,
ప్రకృతికి అందం పచ్చని చెట్లే,
నీ శ్వాస వదిలే వరకూ
స్వచ్ఛమైన గాలి పీల్చుకో,
ఈ పుడమి తల్లికి వేయు
పచ్చని హారం,"
*********
రాయవరపు సరస్వతి
చోడవరం,విశాఖ జిల్లా
Comments
Post a Comment