పత్రహరితం - గొర్రె రాజేందర్
చరవాణి : 9491487882
అంశం : పత్రహరితం
కవిత సంఖ్య : (77)
కవితా శీర్షిక: పచ్చ ధనము
☘☘☘☘☘☘☘☘☘
పచ్చదనం సృష్టికి మూలాధారం
జీవకోటి జీవన భృతికి ఆధారం
మానవాళి మనుగడకు
విడదీయరాని ఆత్మీయత అనురాగం
ప్రాణవాయువు పుట్టుకకు ఆలవాలం
పచ్చని ప్రకృతికి ఆచంద్రతారార్కము
భూమికి అండగా గాలికి అండదండగా
పంచ భూతాల పరిరక్షణకు
ప్రాణం పోయును పచ్చని చెట్టు
సత్తువ కోల్పోయిన వృక్ష తనువుకు
జీవం పోసి జీవితాన్ని ప్రసాదించే
ప్రాణ ప్రదాత పత్రహరితం
తరువు తనువుకే కాక
ప్రకృతి మాత మెడలో వెలిగే
పచ్చల హారపు శోభ పచ్చదనము
పసిడి పంటలతో పల్లె తల్లి తనువును
పరవశింప జేయు పసిడి కాంత
పచ్చ నోటు కొరకు ప్రాకులాడి
ప్రకృతి నంత పాడు చేస్తే
ప్రళయ కాలము వచ్చి ప్రపంచమే పతనం
మానవాళి మనుగడకే పెను ముప్పు
పచ్చదనము లేక ప్రగతి శూన్యం
పచ్చదనము లేని ప్రపంచమే నరకం
పచ్చని చెట్టును నాటుదాం
ప్రపంచ పతనానికి అడ్డుకట్ట వేద్దాం
🌳గొర్రె రాజేందర్🌳
సిద్ధిపేట
Comments
Post a Comment