పత్రహరితం -బస్వ రాజ్ కుమార్

అంశం:పత్రహరితం -బస్వ రాజ్ కుమార్
కవి:
శీర్షిక:పచ్చదనం
సంఖ్య:162

పచ్చదనం మానవుని అవసరాలకు
పదే పదే పచ్చడవుతూనే ఉంది
మనిషి పచ్చదనం కోసం కాకుండా
పచ్చ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు

మొక్కుబడిగా మొక్కను నాటి
చేతులు దులుపుకుంటే సరిపోదు
దాని కాళ్ళమీద అది నిలబడే వరకు
కంటికి రెప్పలా కాపాడుకోవాలి

నరికే చెట్టు నరకం చూపిస్తే
సాకే చెట్టు స్వర్గం చూపిస్తుంది
ప్రతినబూని ప్రతిఒక్కరు
ప్రతి చోటా మొక్కలు నాటాలి

ప్రకృతిని పరిరక్షించి
పచ్చదనానికై పాటుపడాలి
ప్రకృతిమాత పరవశించి
విశ్వశాంతిని కాంక్షించాలి.

బస్వ రాజ్ కుమార్ 🖊🖊
సిద్ధిపేట

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి