అంశం పచ్చదనం - కమ్మరి శ్రీనివాసాచారి


 క్రమ సంఖ్య146
అంశం పచ్చదనం  -  కమ్మరి శ్రీనివాసాచారి
శీర్షిక:ప్రాకులాట


భూమాతను తనువంత గాయాలతో ఎద ఎదను బాదించి నీటి జాడలకై వెతుకులాట

మట్టిలో కలిసిపోని, నీటిలో కరగనట్టి ప్లాస్టిక్ భూతాన్ని దేశానికి పరిచయం చేసి స్వచ్ఛభారత్ పై తొక్కు లాట


విలాసాల కోసం పచ్చని అడవి తల్లిని  ఎడారిగా చేసి  పరిశుభ్రతకై పాకులాట

విపరీతమైన ధోరణుల మద్య
వింత పోకడలతో హోరెత్తించే ధ్వని కాలుష్యంతో చిందులేసి
ప్రకృతిని సర్వ నాశనం చేసే యువతీ యువకుల్లారా మీ దారేటు?

పచ్చని చెట్లను  తెగనరుకుతు
రక్తాన్ని చిందిస్తూ అడవిని ఎడారిగా మారుస్తు అరణ్య రోదనలు ఎవరి కోసం?

పచ్చని చెట్లను పెంచి మలయ సమీరాలు ఇచ్చే ప్రకృతిని చల్లబరిచే ప్రశాంత జీవనకై నిత్య తోరణాలతో స్వాగతం పలుకుతున్నాం

నీటి బొట్టును కాపాడుతూ, భూగర్భ జలాలను
 రక్షిస్తూ నీటి చుక్కను అందించే చెరువులను
  నేటి నుంచె భావితరాలకు
నిలువుత్తు పచ్చదనాన్ని అందిద్దాం

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి