పత్రహరితం - నల్లు. రమేష్

పేరు:-నల్లు. రమేష్
కవితా సంఖ్య:-143
అంశం:-పత్రహరితం  -  నల్లు. రమేష్
శీర్షిక:-"బోన్సాయి బ్రతుకులు"

"తోటంతా 
 తరలి పోతుంది
 కుండీలు కుండీలుగా

 ఈనెల చేతులు
 స్వార్ధానికి చిక్కి
 పలచ బడిపోతున్న
 ప్రేమ హరితం

 గాజు గోడల మధ్య
 కుదించుకు పోతున్న
 రంగుల జీవితం

 అద్దెకు తెచ్చుకున్న
 గాలి పొరలలో
 అర్ధాంతరంగా ముగిసి పోతున్న
 బోన్సాయి జీవితాలు

 ముసలితనంతో
 తోట ముడుచుకు పోతుంది
 పచ్చని ఆసరాకై
 పరితపిస్తుంది

 కుటుంబంలో
 అనుబంధాలు ఆప్యాయతలు
 అడవులై రాలిపోతుంటే
 సమాజమంతా
 హరితం ఆవిరైన
 కుటుంబ ఆకులే కదా!"

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి