పత్ర హరితం - బి.సుధాకర్

పేరు.
సంఖ్య..294(20-6-2019)
అంశం..పత్ర హరితం  -  బి.సుధాకర్
శీర్షిక..ఆకు పచ్చ  అందరు మెచ్చ

పుడమి తల్లి గర్భాన పురుడుపోసుకొని
పత్రహరితంతో ప్రాణం నింపుకొని
లేతపచ్చని చేతులతో ప్రణమిల్లుతు పైకివచ్చి
ప్రాణవాయువునివ్వ పదిలంగా పెరిగింది

బోసినవ్వులు చిందించే పసిపాపలా
ముసి ముసి నవ్వులతో ముందుకు వచ్చే మొక్క
నేలతల్లికి పచ్చని ఆకులతో అల్లిన చీరతో
ప్రకృతి ఇంట పండగ చేయ సందడి పెంచే

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు
అందరు వేసే ఒట్టు పచ్చగ పెరిగే చెట్టు
నరికేవారిని కనిపెట్టు మారకపోతే పనిపట్టు
కరువు రక్కసీ రావద్దంటే పచ్చని చెట్టు నిలబెట్టు
నల్లని మేఘం రావాలంటే
చెట్లను పెంచి చూపెట్టు
కదిలే గాలి చల్లదనానికి
నడుంభిగించ తలపెట్టు

పర్యావరణం పచ్చగ ఉంటే
రోగాలెప్పడు దరిరావు
పచ్చని చెట్లు ప్రాణంగుంటే ప్రజాజీవితం శాంతిని పొందు
భానుడి తాపం పెరగొద్దంటే
మనిషిలో మార్పురావాలీ
పచ్చని చెట్లు ఉండాలంటే ప్రజల ఆశలో చెట్టుండాలి

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి