పత్రహరితం -సుభాషిణి వెగ్గలం

పేరు :సుభాషిణి వెగ్గలం
కవిత సంఖ్య :76
అంశం :పత్రహరితం -సుభాషిణి వెగ్గలం
శీర్షిక :ఆరోగ్య ప్రదాయని

హరితం....
విన్నా కన్నా ఆహ్లాదమే
పచ్చని పొదలతో
అల్లుకొన్న హరితం
మనసులను మురిపించి
మనో రుగ్మత లను దూరం చేస్తుంది

నేలమ్మ నీరమ్మ సూరన్న సాక్షిగా
చిగురులు తొడిగిన హరితం
పలువన్నెల ఫలముల
తీరొక్క రుచుల రూపుదాల్చి
జిహ్వను మురిపించి
గుండె గూటిలో పదికాలాల పాటు
కొలువుండే ఆరోగ్య ప్రదాయనవుతుంది

అందమైన సీతాకోకగ రూపు మార్చుకొను
గొంగళి పురుగుకి ఆహారమిచ్చి ఆధారమవుతుంది
కొమ్మలై రెమ్మలై
రారమ్మని పిలిచేరాగమై
నీడనిచ్చు హస్తమై
కనువిందు చేయు కువకువలకు
హరితవనాల నెలవవుతుంది

ఆదర్శ

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి