పత్రహరితం -మమత ఐల
కవిత సంఖ్య:—70
అంశం:—పత్రహరితం -మమత ఐల
శీర్షిక:— మొక్కలు
🌱🌱🌱🌱🌱🌱🌱🌱
మొక్కలు ఆకుపచ్చగా కనిపించటానికి కారణం పత్రహరితం
ఆకుల్లో పిండిపదార్థం తయారయ్యే
కిరణజన్య సంయోగ క్రియకు
కాంతి చర్యలు
నిష్కాంతిచర్యలు
హరితరేణువుల్లోనే
జరగడానికి పత్రహరితం
దోహదకారినైనా
ఈ కాంతి నిష్కాంతి చర్యల్లో
పత్రహరితమున్నా
కాంతి చర్యలకు మాత్రమే
పత్రహరితమవసరం
కాని కాంతిచర్యలు జరిగితేనే
నిష్కాంతి చర్యలు జరుతాయి
ఆకుల్లో స్తంబకణాలు
స్పంజికణాలు వాటిల్లో
హరితరేణువులుండి
ఈ..హరితరేణువుల్లో
పత్రహరితముంటుంది
మనకు మల్లే మొక్కకూడా జీవి
ఈ..జీవికి
పై బాహ్య చర్మం
కింది బాహ్య చర్మం వుండి
ఈ..రెంటి మధ్య నీలిరంగు కణాలతో
నీటిని సేకరిస్తాయి
వీటికి రక్షకకణాలుంటాయి
ఆకు ఆకుపచ్చరంగులో
కనబడడానికి కారణం
ఆకుల్లో ఎక్కువ పత్రహరితముండంవల్లే
🌳చెట్లు కూడా జీవులే
కనుక జీవహింస మహాపాపం
చెట్లను కాపాడదాం!!
పర్యావరణను పరిరక్షిద్దాం!!
---మమత ఐల
హైదరాబాద్ ---
Comments
Post a Comment