పత్రహరితం - ఎడ్ల . లక్ష్మి


అంశం పత్రహరితం  -  ఎడ్ల . లక్ష్మి
కవిత .సంఖ్య.166 
శీర్షిక : ప్రభావం
☘☘☘☘☘☘☘☘☘

పచ్చని లతలతో పారిఉన్న
పందిరి ఇంటికెంతో అందం
గుమ్మానికి మామిడి తోరణాలందం
పచ్చని చెట్లు ఎక్కడ ఉంటే
అక్కడ హరితానందం
పూర్వం ప్రవోజనంలో
మోతుకాకు విస్తారాకులో
బొజనం వడ్డన చేసేవారు
విస్తారాకులోని భోజనం
అరోగ్యానికి ఎంతోమేలు
జరుగుతుందని పెద్దల నమ్మకం
ఇప్పుడు కాగితం విస్తార్లు
వాటిలో తిండి దండి ముప్పు
పచ్చటాకుల గూర్చి ఇక ఎన్నెన్నో
కరివేపాకు కొత్తిమీర పూదీన
చెన్నంగి ఆకు పుంటాకులు
కలిపి రోటీ పచ్చెడ చేస్తే ఎంత రుచి
కడుపు నిండ భోజనం
కంటి నిండ నిద్ర
ఇది పత్రహరత ప్రభావం

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి