పత్ర హరితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

పేరు::
అంశం::పత్ర హరితం  -  వురిమళ్ల సునంద, ఖమ్మం
శీర్షిక::పచ్చగ బతుకు...
సంఖ్య::287
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
లేలేత కిరణాలతో దోస్తీ చేసి
ఎంత చక్కగా హరిత ఆహారం 
తయారు చేసుకుంటాయో కదా!

బిడ్డల క్షేమానికి తపించే తల్లిలా
విషాలు కాలుష్యాన్ని మింగి
విశ్వ క్షేమానికై గరళం మింగిన శివుడవుతుంటాయి..

ప్రాణవాయువును 
పచ్చ(ద)ధనపు పత్ర హరితాల్లో 
దాచి పంచి పెడుతుంటాయి
అవనంతా ఆరోగ్య నిలయం కావాలని‌‌....

కొమ్మ రెమ్మల పానుపేసి 
రేపటి తరాన్ని
పత్ర పొత్తిళ్ళలో సాకడానికి
విత్తనమై మొలకెత్తడానికి..


"ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ"
ఓ మహా కవి అన్నట్టు 
సృష్టి రచన ఎంత గొప్పదో కదా!

చినుకు పడితే చాలు
భూసతి బుగ్గల్లో ఆకుపచ్చని నిగ్గులు
అణువణువునా పత్ర హరితాల పల్లవింపులు...

ఏ మొక్క చరిత్ర చూసినా తెలిసేది ఒక్కటే...
మనుషులమైన మనకు చేసే నీతి బోధ ఒక్కటే..
పత్ర హరితమా  హరిత పత్రమా
కుడి ఎడమైనా పొరపాటు లేకుండా
చెప్పెది ఒక్కటే..
పచ్చగా బతుకు బతికించు
సమాజ కాలుష్యాన్ని నివారించు..

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి