పత్రహరితం - డా.బల్లూరి ఉమా దేవి.

డా.బల్లూరి ఉమా దేవి.
 కవితా సంఖ్య :167
అంశము: పత్రహరితం  -  డా.బల్లూరి ఉమా దేవి.
శీర్షిక:పులకరింత

హరిత భరితమైన తరువులను చూడ 
ఉప్పొంగు హృదయము సంతసాన
తొలకరి చినుకులు తనను తాకగానే 
ఎండి బీటలు వారిన పుడమి తల్లి 
చిన్న మొలకలతో అగుపించి మురిపించి
హాయి కూర్చును మానవాళి కెల్ల
ఆకుపచ్చని కోక కట్టిన రీతిగా 
ప్రకృతి కాంత తనువెల్ల హరిత భరితమవగ
ఆమని శోభయే అవనిలో నిండగా
పక్షి జాతి మురిసి పరవశాన
 ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ ఆకుపచ్చగమారి
పులకరించినట్లు తలలనూపి
బాటసారులకు పచ్చగడ్డితో పానుపై 
పరవశింపజేసి అలసటను బాపు
కూరగాయలైన పూల తరువులైన
అరిటాకు లైనను పనసాకులైనను
తులసి మొక్కలైన తమలపాకు తీవైన
హరిత పత్రములతో కనువిందు చేయుచు
శాంతి కూర్చు మదికి జగతి యందు.

డా. బల్లూరి ఉమాదేవి
 20//6/19/

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి