పత్ర హరితం - మన్నవ పద్మ


కవితా సంఖ్య:12
అంశం: పత్ర హరితం - మన్నవ పద్మ
శీర్షిక: అనియత్ గురువు

ఆది నుంచి మానవుని
అక్కున చేర్చుకొని
కుక్షి బాధ తీర్చి
వలువై కౌగలించి
తోడు నీడ అయి
లాలించి పాలించింది
పచ్చదనం 

అడుగడుగున తానే
అక్షయమై అండగా
నిలిచింది. ధరలోన

తన వారసులైన 
పత్ర ఫల పుష్పాలను
సంఘ సేవకు అంకితం
చేసి అమ్మలకే ఆదర్శమయ్యింది

శంఘ జీవనం మనకు
అనాదిగా నేర్పుతూ
పొరుగు వారికి సాయపడమని
చేస్తూ చెప్తోంది
అకుంఠిత దీక్ష తో
అలుపన్నది ఎరుగక
స్వచ్ఛమైన శ్వాస అయి కళ్ళకు పచ్చని చలువై చక్కని వరాలిచ్చి బ్రతుకు
పాఠశాలలో అనియత
గురువై పాఠించి నేర్పుతుంది

పచ్చని ప్రథమ గురువుకు అంకురార్పణ చేసి
ప్రాణంగా పెంచాలి !

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి