పత్ర హరితం -శైలజ మంగళంపల్లి


అంశం: పత్ర హరితం -శైలజ మంగళంపల్లి

కవితా సంఖ్య: 75

శీర్షిక: సమాజం

ఆ పత్రం తాను పచ్చగా 
కళ కళ లాడుతూ
నలుగురికీ నీడనవ్వాలని
బ్రతుకును పంచాలని
తన అమాయకపు ఎదలో ఎన్ని కలలు కంటుందో
కొమ్మ కొమ్మనూ
రెమ్మ రెమ్మనూ పెనవేసి
ఎన్ని బంధాలను అల్లుకుంటుందో
ఉషోదయపు వేకువలో తాను
నిత్య చైతన్యమై
కట్టుబాట్ల కలిమిలో
ఎన్ని స్వేచ్చా కుసుమాలను
పంచుతుందో
అందుకే ఆ పత్రం తాను పచ్చటి వసంతంలా చివురించాలని ఆశపడుతూనే
ఉంటుంది
కానీ చెంత చేరిన చీడపురుగుల వేటులో
పొద్దు వాలిన కిరణాల కాటులో
బంధాలు మోడులై
కలలు రాలి
పచ్చదనం ఎండి నిశ్శబ్దంగా 
నేలరాలి పోతుంది
పచ్చదనం పంచే సమాజమైనా
పచ్చదనం ఎండిన పత్రమైనా

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి