పత్రహరితం - కె.ఎల్.సరోజారెడ్డి
రచన : కె.ఎల్.సరోజారెడ్డి
అంశం : పత్రహరితం - కె.ఎల్.సరోజారెడ్డి
శీర్షిక : హరిత సోయగం
సంఖ్య : 260
తేదీ : 20/6/19
**********
ఆకులన్నీ రాలిపోయి
మోడై విలపిస్తున్న వృక్షాన్ని
చిన్నారి చిగురులు చిరునవ్వుల
సంతకాలతో మురిపిస్తాయి...
చెట్టమ్మకు పచ్చచీరను చుట్ట బెట్టి
నిండుముత్తైదువగా అలంకరించి
కళ్యాణ శోభను కూరుస్తాయి...
పత్రహరితం పెళ్ళిపెద్దై
విందుభోజనం తయారీలో హడావిడిగా
అందరికీ పనులు పురమాయిస్తుంది....
వేళ్ళు జలాన్ని తేగా
భానుడు ఆత్మీయంగా హత్తుకోగా
గాలి బొగ్గు పులుసు రుచి చూపించగా
పిండివంటల ఘుమఘుమలతో
ఆనందాల లోగిలి అవుతుంది....
గుండెనిండా దయామృతాన్ని నింపుకుని
వాయువును శుద్ది చేసి
అందరికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ గా
చల్లని ఆప్యాయతలనుపంచే కల్పవల్లిగా
పచ్చ తోరణమై శుభం పలుకుతుంది
అంశం : పత్రహరితం - కె.ఎల్.సరోజారెడ్డి
శీర్షిక : హరిత సోయగం
సంఖ్య : 260
తేదీ : 20/6/19
**********
ఆకులన్నీ రాలిపోయి
మోడై విలపిస్తున్న వృక్షాన్ని
చిన్నారి చిగురులు చిరునవ్వుల
సంతకాలతో మురిపిస్తాయి...
చెట్టమ్మకు పచ్చచీరను చుట్ట బెట్టి
నిండుముత్తైదువగా అలంకరించి
కళ్యాణ శోభను కూరుస్తాయి...
పత్రహరితం పెళ్ళిపెద్దై
విందుభోజనం తయారీలో హడావిడిగా
అందరికీ పనులు పురమాయిస్తుంది....
వేళ్ళు జలాన్ని తేగా
భానుడు ఆత్మీయంగా హత్తుకోగా
గాలి బొగ్గు పులుసు రుచి చూపించగా
పిండివంటల ఘుమఘుమలతో
ఆనందాల లోగిలి అవుతుంది....
గుండెనిండా దయామృతాన్ని నింపుకుని
వాయువును శుద్ది చేసి
అందరికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ గా
చల్లని ఆప్యాయతలనుపంచే కల్పవల్లిగా
పచ్చ తోరణమై శుభం పలుకుతుంది
Comments
Post a Comment