పత్రహరితం - మద్దెల ప్రభాకర్
అంశం :పత్రహరితం - మద్దెల ప్రభాకర్
శీర్షిక: "చిగుళ్ళు"
********
వనమంతా వికసించింది వర్షపు చిరుజల్లులతో
కొంగొత్త హోయలు ఒలకబోస్తూ పులకరింపులతో
జడివాన కురువుగా చిగురించే మోడువారిన మాను
యవ్వనాన కొత్తసొగసులద్దినట్టు పుట్టుకొచ్చే చిగుళ్ళు
చిలకలు చేరి కొమ్మను వాలే
చింత పొగరుగా చిగురు వేసే
పచ్చని పత్రదలములు,
ఫలములతో నిండెను మేను
వరుని కొరకు వేచే కన్నెలా అందరినీ ఆకర్షించే,
జీవులన్ని
మాను చెంతకు చేరి
ఫలములనారగించి
నీడలోన సేదతీరి
చెట్టును రక్షించ ప్రతిన బూనే.
Comments
Post a Comment