పత్రహరితం - ఏడెల్లి రాములు
నేటి కవిత
క్రమ సంఖ్య*239
అంశం* పత్రహరితం - ఏడెల్లి రాములు
శీర్షిక* పచ్చని పతాకం
పత్రాలన్నీ చత్రఛాయలే
వృక్ష జాతి విస్తరణలో
నీరు తా వేరై
గాలి శుద్ది లో ఆకే యంత్రం
ఎన్నొన్నో చిత్ర చిత్రకళ లేసుకున్న
ఆకుల అర్ణవాలను వర్ణించతరమా
టేకుటాకు కెంత షోకో
విత్తన మండెకు పానుపయేవేళ
తక్కలాకుకు వావిలాకుకు
ఎంత వయ్యారమో బాలింతల
వంతుల తానానికి తంపుల్లోకొచ్చేవేళ
లక్షల్లో వృక్షజాలం
ఇలకు జీవామృతం
తా కాయై పండై నిండు విత్తనమై
నిజ భోజన విస్తరాకై తాంబూలమై
సకల జీవుల మనుగడ
పురోగతిలో అగ్రతాంబూలం
గరికాకు నుండి మర్రాకుదాకా
మరువం నుండి తమలపాకు వరకు
లోకోపయోగమే పరోపకారమే
తనువంతా పసిడి పచ్చని కోకై
నీడనిచ్చే అమ్మ లోగిలి చెట్టుధనం
నీటికి ఏటికీ ప్రకృతి ఆకృతి లో
అధ్బుతానంద చిదానంద రూపం
రాలిన ఆకైనా రాలెపూవు చందమే
పండుటాకులన్నీ చందన శోభితమే
హరితమై నరనారాయణులు మెచ్చినది
సుశోభితమై శుభ్రజ్యోత్స్నల పల్లవించునది
కాపాడుకుంటే లోకమంతా పచ్చని కాపురం
ఎండు పుల్లలకెగబడితే మండే అగ్ని గుండం ఈ భూవలయం
ఏడెల్లి రాములు
ది* 20*06*2019(16*55)
ఎల్కలపెల్లి
క్రమ సంఖ్య*239
అంశం* పత్రహరితం - ఏడెల్లి రాములు
శీర్షిక* పచ్చని పతాకం
పత్రాలన్నీ చత్రఛాయలే
వృక్ష జాతి విస్తరణలో
నీరు తా వేరై
గాలి శుద్ది లో ఆకే యంత్రం
ఎన్నొన్నో చిత్ర చిత్రకళ లేసుకున్న
ఆకుల అర్ణవాలను వర్ణించతరమా
టేకుటాకు కెంత షోకో
విత్తన మండెకు పానుపయేవేళ
తక్కలాకుకు వావిలాకుకు
ఎంత వయ్యారమో బాలింతల
వంతుల తానానికి తంపుల్లోకొచ్చేవేళ
లక్షల్లో వృక్షజాలం
ఇలకు జీవామృతం
తా కాయై పండై నిండు విత్తనమై
నిజ భోజన విస్తరాకై తాంబూలమై
సకల జీవుల మనుగడ
పురోగతిలో అగ్రతాంబూలం
గరికాకు నుండి మర్రాకుదాకా
మరువం నుండి తమలపాకు వరకు
లోకోపయోగమే పరోపకారమే
తనువంతా పసిడి పచ్చని కోకై
నీడనిచ్చే అమ్మ లోగిలి చెట్టుధనం
నీటికి ఏటికీ ప్రకృతి ఆకృతి లో
అధ్బుతానంద చిదానంద రూపం
రాలిన ఆకైనా రాలెపూవు చందమే
పండుటాకులన్నీ చందన శోభితమే
హరితమై నరనారాయణులు మెచ్చినది
సుశోభితమై శుభ్రజ్యోత్స్నల పల్లవించునది
కాపాడుకుంటే లోకమంతా పచ్చని కాపురం
ఎండు పుల్లలకెగబడితే మండే అగ్ని గుండం ఈ భూవలయం
ఏడెల్లి రాములు
ది* 20*06*2019(16*55)
ఎల్కలపెల్లి
Comments
Post a Comment