పత్ర హరితం - ఐరేణి కృష్ణవేణి


అంశం:పత్ర హరితం - ఐరేణి కృష్ణవేణి
శీర్షిక: పుడమి అందం
కవిత సంఖ్య:21

తొలకరి చినుకులతో పులకించిన అవని పచ్చని ప్రకృతిని మానవాళికి మనోనేత్ర సుందర రూప తివాచీని పరిచి పెడుతుంది!

పశువులకు పచ్చని పంచభక్షపరమన్నమై పండుగలా విందునిస్తుందీ!

పక్షులకు గుబురుల గూడులతో ,లేతచిగురుల ఒత్తికలను ఇచ్చి,కిల కిల రాగాల పుష్పమధురిమల తోటవుతుందీ!

పంటపొలాలకు ఆకుపచ్చ రంగును అద్దకం వేసీ.. ఆకలి చూపుల  పసిబుగ్గలకు
అమ్మ చీర కొంగులో దాచితెచ్చిన  పంట సిరుల కమ్మని  పాల బువ్వవుతుందీ!

ఏ ఋతువుకు ఆ ఋతువుల పూలు, పండ్లతో పేరంటానికి స్వాగతాలు పలుకుతుంది!

మనిషి హరిత వనాలను కాపాడుకుంటే..
పుడమి పై పత్రహరితాలను పాన్పుగ పరిచీ.. జగతి సిగను మెరిపిస్తుందీ!
జీవరాసులను కాపాడుతుందీ!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి