పత్రహరితం-ఉదయశ్రీ ప్రభాకర్

పేరు. ఉదయశ్రీ ప్రభాకర్
కవిత సంఖ్య.247
అంశం. పత్రహరితం

హరితం హరితం..

హరితం..మనసును ఉల్లాసం పరిచే వర్ణం
ప్రకృతికి శోభయమానం ఈ సుందర వర్ణం
శుభాలకు సూచిక ఈ వర్ణం
అంగీకారాలు చిరునామ ఈ వర్ణం..హరితం

కనులకు చల్లదనాలను పంచుతూ
పుడమిని సుందరంగా తీర్చిదిద్ది
సస్యశ్యామలం చూపి దేశ కాలపరిస్థితులను చెప్పకనే చెప్పే చెలిమి నేస్తం హరితం

పుడమి తల్లి దాహం పూర్తిగా తీరితే..
కొండల వెనుక దాగిన సూర్యుడు చూపులతో మనసారా తడిమితే..
తరువులు చిగురుస్తాయి..పత్రాలు హరితాలతో మెరుస్తాయి..

పంట చేలలో పచ్చదనాలు నాట్యమాడితే..
రైతన్న కళ్ళల్లో ఆనందo చిందేస్తుంది
జగతికి ఆకలి బాధలు తీరుతాయని..
కుటుంబ భారం తగ్గుతుందని

చిరుగాలి తరంగాలతో పత్రహరితాలు సందేశం పంపుతాయేమో మేఘుడికి
చిఱుజల్లై కవ్విస్తాడు హొయలు పోతున్న ప్రకృతి కన్యను..

హరితాలు లేని జగతి ఎడారిలా తలపిస్తూ
ఆకలి దప్పులు వెంటాడుతూ
చల్లని సమీరాలు కరువై శ్వాస వేడెక్కుతుంది ఊపిరి అందక
ఊహల్లో సైతం భయానక దృశ్యమై

భయాలేవి నిజాలై నిల్వక ముందే ప్రకృతిని నింపుదాం హరిత వనాలతో
పుడమికి పచ్చ చీరకట్టినట్లు..

ఉదయశ్రీ ప్రభాకర్..
20.06.19

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి