పత్రహరితం - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి


హైదరాబాద్
కవితసంఖ్య..249
అంశం...పత్రహరితం  -  డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి
శీర్షిక..పచ్చదనం
----------------------------
పుడమి తల్లి పురుడుపోసుకుని
తనలో దాగిన ప్రతి బీజం
నీటిచుక్క తాకగానే తలలెత్తి చూస్తాయి!!

రోజురోజుకు ఇంతింతగా ఎదుగుతూ సూర్యునితో
సహవాసం చేసి కిరణజన్య సంయోగం ద్వారా పచ్చదనాన్ని ఒంటినిండా నింపుకుని
ఆకర్షణీయంగా రూపు దిద్దుకుంటుంది!!

లేలేత ఆకులతో మొక్కగా ఉండి పెద్దదై ఆకాశాన్ని అందుకోవాలన్నంత ఎత్తు ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించి వృక్షమై 
వంటి నిండా పచ్చదనం నింపుకుని అలరారుతోంది!!

ఎంత వేడినైనా తనలోనే దాచుకుని సకల ప్రాణికోటికి
చల్లనైన గాలినిస్తూ ఆక్సిజన్ ను అందిస్తుంది!!

పరోపకారమే దాని ఊపిరి
కూడు గూడు నీడను ఇస్తే
అవసరానికి వాడుకుంటూ
ఎంత హింసించినా 
తరగని వుపకార నిధి 
వులుకని పలుకని మౌని!!

రంగురంగుల పూలను ఒంటినిండా నింపుకుని అలరారుతుంటే
 భ్రమరాలు వచ్చి చుట్టుముట్టు చేరి మకరందాన్ని గ్రోలి
ఊపిరాడకుండా చేసినా చెక్కుచెదరక సువాసనలు పంచుతూనే ఉంటాయి!!

కాయల భారంతో వంగి
జన్మనిచ్చిన పుడమి తల్లికి 
దణ్డంబెట్టి కృతజ్ఞతతో
ఊగిపోతుంది
ఎదిగిన కొద్దీ ఒదిగే సంస్కారి!!

మానవ సమాజానికి పుట్టుక నుండి చావు వరకు వెన్నంటి వుండే చక్కని నేస్తం!!

ఆరోగ్యం ఆహారం ఆనందం పంచి ఇచ్చే చెట్లను పెంచుదాం
మన జీవన ప్రమాణాన్ని పెంచుకుందాం
కాలుష్య కోరలను పీకేద్దాం
పర్యావరణాన్ని కాపాడుదాం!!

వృక్షో రక్షతి రక్షితః!!!

డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి