పత్ర హరితం - పగిడిపల్లి సురేందరు పూసల
అంశం:పత్ర హరితం - పగిడిపల్లి సురేందరు పూసల
శీర్షిక :హరిత వర్ణం
కవిత స0ఖ్య :127
20-6-19
-------------------------------------
నేటి విత్తులే రేపటి మొక్కలై
లోకమంతా విస్తారించాలనుకుంటుంది
పత్ర హరితమై పచ్చగా మారి
నిండు ముత్తదువుల ఉంటుంది
సూర్యుని కిరణాలు సోకి
కిరణజన్య సంయోగ క్రియ చెంది
కొమ్మలను దేశమ్మీద బాహువులు చాచిన
వృక్షముగా ఎదుగుతుంది!
పచ్చని వసంతంలా..
నిత్య శోభితమై నిలిచి
చిగురాకులా వివిధ ఆకృతులు చెంది
ఎందరికో నీడలా..
ఎందరికో ఆవాసములా..
వీచే గాలుల్నీ కురిసే వానల్నీ
కాల్చే సూర్యున్నీ లెక్క చెయ్యక
నిరంతర చెట్టుకు చెలిమిగా
నిబ్బరంగా నిలిచిపోతుంది
చల్లదనాన్నిచ్చే చనువై
ఆయువునిచ్చే ప్రాణవాయువుగా
నిశ్శబ్దంగా నేల రాలుతుంది!
పచ్చని పత్రాలతో ప్రేమను పంచుతుంది
మొక్కలను నాటుదాం
మనుషులుగా మిగులుదాం!
మొక్కవొని ధైర్యంతో మొక్కలు నిలబడితేనే
జీవకోటికి ప్రాణవాయువు అందించేది
తరువులు పచ్చదనంతో పరుచుకుంటేనే
ధరణి దేహం సౌభాగ్యంతో విరసిల్లేది!
Comments
Post a Comment