పత్ర హరితం చక్రపాణి,అనకాపల్లి, విశాఖజిల్లా
నేటికవితాంశం: పత్రహరితం
రచన:డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
కవిత సంఖ్య: 193
కవిత శీర్షిక:
ప్రేమ హరితం
జీవం పోసుకోగానే సరికాదు
సరైన పోషకాలూ అందాలి
అప్పుడే నిగనిగలు మిసమిసలు
మొక్కకైనా మనిషికైనా.
నేలనుంచి తల్లివేరు పీల్చుకున్న నీరు
కొమ్మరెమ్మల ఈనెల్లో ప్రవహించి
వాటి ఎదుగుదలకి మెట్లౌతాయి
ఇంకాచెప్పాలంటే ఆయువుపట్లౌతాయి.
నింగినుంచి పొందిన సూర్యరశ్మి
ఉత్తేజమే కళాకాంతులౌతాయి
గాలికి తలలూచి చేవపెంచుకొని
భవిష్యత్ లో వృక్షరాజాలౌతాయి
ఋతువులను బట్టి ఆకులురాల్చినా
మరలా పచ్చదనం చిగురించి
హరితవనాలై వికసిస్తాయి
చల్లని నీడలనిచ్చి సేదతీరుస్తాయి
చెట్టును అతుకున్న ఆకుచూస్తే
బిడ్డనుహత్తుకున్నఅమ్మే గుర్తొస్తుంది
ఆకులుంటేనే చెట్టు హరితం
అమ్మ ఉంటేనే ప్రేమభరితం
చక్రపాణి,అనకాపల్లి, విశాఖజిల్లా
రచన:డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
కవిత సంఖ్య: 193
కవిత శీర్షిక:
ప్రేమ హరితం
జీవం పోసుకోగానే సరికాదు
సరైన పోషకాలూ అందాలి
అప్పుడే నిగనిగలు మిసమిసలు
మొక్కకైనా మనిషికైనా.
నేలనుంచి తల్లివేరు పీల్చుకున్న నీరు
కొమ్మరెమ్మల ఈనెల్లో ప్రవహించి
వాటి ఎదుగుదలకి మెట్లౌతాయి
ఇంకాచెప్పాలంటే ఆయువుపట్లౌతాయి.
నింగినుంచి పొందిన సూర్యరశ్మి
ఉత్తేజమే కళాకాంతులౌతాయి
గాలికి తలలూచి చేవపెంచుకొని
భవిష్యత్ లో వృక్షరాజాలౌతాయి
ఋతువులను బట్టి ఆకులురాల్చినా
మరలా పచ్చదనం చిగురించి
హరితవనాలై వికసిస్తాయి
చల్లని నీడలనిచ్చి సేదతీరుస్తాయి
చెట్టును అతుకున్న ఆకుచూస్తే
బిడ్డనుహత్తుకున్నఅమ్మే గుర్తొస్తుంది
ఆకులుంటేనే చెట్టు హరితం
అమ్మ ఉంటేనే ప్రేమభరితం
చక్రపాణి,అనకాపల్లి, విశాఖజిల్లా
Comments
Post a Comment