పత్ర హరితం - చిందం సునీత

చిందం సునీత
తేది: 20/6/2019
అంశం: పత్ర హరితం  -  చిందం సునీత
కవిత సంఖ్య: 175
కవిత శీర్షిక: పత్ర హరితం

పత్రహరితంతో నిలవాల్సిన
ప్రకృతి పచ్చదనం
వర్షాలు కానరక
కరువు కాటకాలతో
కష్టాలు కొనితెచ్చుకోవడం
చేతుల కలిన0క
ఆకులు పట్టినట్లు0ది!
మొక్కలు నాటక,
చెట్లను పెంచక
ప్రకృతి కోసం అర్రులు
చాచడం అవివేకం!
ఇప్పటికైనా
మొక్కలు నాటండి మానవులరా!
సర్వప్రాణులు బ్రతకాలంటే
జీవంపోసే హరితవనాలను
పెంచాలి!
ప్రాణవాయువునిచ్చి
పర్యావరణాన్ని కాపాడే
పత్రాలు
విస్తారంగా విస్తరించాలి!
పచ్చదనం తెచ్చి
ప్రగతినంతటిని కాపాడాలి!!.

రచన: చిందం సునీత
కోరుట్ల.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి