పత్రహరితం - వినీల దుర్గ
కవితా శీర్షిక : పత్రహరితం - వినీల దుర్గ
కవితా సంఖ్య : 196
తేదీ : 20/06/19
మనసుకు ఆహ్లాదం
జగతికి శోభాయమానం
పర్యావరణ కు ఆరోగ్యం
జగతికి ప్రాణాధారం...!!
ప్రకృతి మెరియు పడుచుపిల్ల
సొగసుల తో అందం
పూరెమ్మలకు కనువిందై
మెలుగు జీవనం
మానవాళికి ఎన్నో ఔషధాల మూలం...!!
కరిమబ్బు చినుకై ముద్దాడలన్నా
అవసరం
రైతన్నకు సేదతీర్చాలన్నా ముఖ్యం
పత్రహరిత వనాలు సకాల వర్షాలకు
చల్లగ వీచే పవనం....!!
పెంచండి విరివిగా మొక్కల
పెంపకం
భావితరాలకు కళకళ లే నీటి
వనరుల సోయగం
మనకందరికీ అంతులేని ఆనందం....!!
Comments
Post a Comment