పత్రహరితం - కటుకం కవిత

పేరు:కటుకం కవిత
తేది: 20/6/2019
అంశం: పత్రహరితం - కటుకం కవిత
కవిత సంఖ్య:235
కవిత శీర్షిక: నేలమ్మకు పచ్చలపథకం

మానవాళికి ఆధారం చెట్లు
జీవకోటి ప్రగతికి అవే కదా తొలిమెట్లు...
పర్యావరణాన్ని రక్షించి
పత్రహరితాల పచ్చదనంతో
సతతహరితాలకు బాటలు వేయడం ప్రతిఒక్కరి లక్ష్యం కావాలి అవనియంతా పచ్చని తివాచీతో పరిఢవిల్లాలి...!!

మానవమనుగడకు చెట్లు చేయని ఉపకారమే లేదు...
పచ్చని పత్రహరితాలతో
కంటికి వెలుగుగా...
అలసిసొలసిన మేనుకు విసనకర్రగా...
ఔషధమొక్కగా వైద్యము చేయుచు ఆరోగ్యప్రదాయినిగా...
పుట్టుక నుండి కడదాకా  తోడునీడగా సాగే
ఆప్తమిత్రులు తరువులు...!!

మానవత్వంతో మేల్కొని
మనుషులమంతా ఒక్కటై
కరువులను పారద్రోలే తరువులను ఆధునిక అశోకులమై నడుం బిగించి
ఉద్యమంగా పెంచుదాం...
పుడమితల్లికి పత్రహరితాల పందిరి వేసి ప్రకృతిమాతకు
హరితహారాల మాలతో అలంకరించుదాం...!!

ప్రాణవాయునిచ్చి
పండ్లూఫలాలతో ఆకలితీర్చే తరువులను విరివిగా పెంచి వనసంరక్షణయే జనసంరక్షణగా ఎంచి
ఊరంతా వనాలతో పచ్చదనపు సిరులతో సమతుల్యత కాపాడుదాం...
తరతరాలకు తరగని సంపదగా చెట్లనే ధనముగా భావితరాలకు అందిద్దాం...
నేలమ్మకు పత్రహరిత పచ్చలపథకం
చేయించి తరించుదాం...!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి