పత్రహరితం -అనూశ్రీ GDK
పేరు~~
కవితసంఖ్య~187
అంశం~పత్రహరితం -అనూశ్రీ
శీర్షిక~~హరితవనం
☘🍃☘🍃☘🍃☘
తొలకరి చినుకు రాలిందంటే చాలు
పచ్చని వనమై పుడమి
పులకిస్తుంది...
హరితవర్ణపు చీరని
సింగారించుకుని గరికపూవుసైతం
ముచ్చటగా కళలొలుకుతుంది.....
ప్రకృతిలో పచ్చదనం
పత్రహరితాన్ని నింపుకున్న
పత్రాలు ప్రత్యేక అందం....
భానుని కిరణాల
ఒడిసిపట్టుకుంటూ
పుడమికి నిరంతర జీవాన్ని అద్దుతూ జీవనాన నిలుపుతోంది పచ్చదనం...
పచ్చగా అల్లుకున్న పూలతీగ
ముంగిట పూజలందుకునే
తులసీ మాత శుభప్రదంగా
ఇంటిల్లిపాదినీ కాపాడుతుంది...
సృష్టిలోని పచ్చదనమే
మానవాళికి ఊపిరై
మనుగడలో అడుగడుగునా
తోడై నడిపిస్తోంది.....
అన్నపూర్ణ సకలజీవుల
అవసరాలను తీర్చె
హరితవనాలను కాపాడుకోవడం
మన ఉనికిని నిలుపుకోవడం
ప్రతీ ఒక్కరి బాధ్యత......!
అనూశ్రీ
కవితసంఖ్య~187
అంశం~పత్రహరితం -అనూశ్రీ
శీర్షిక~~హరితవనం
☘🍃☘🍃☘🍃☘
తొలకరి చినుకు రాలిందంటే చాలు
పచ్చని వనమై పుడమి
పులకిస్తుంది...
హరితవర్ణపు చీరని
సింగారించుకుని గరికపూవుసైతం
ముచ్చటగా కళలొలుకుతుంది.....
ప్రకృతిలో పచ్చదనం
పత్రహరితాన్ని నింపుకున్న
పత్రాలు ప్రత్యేక అందం....
భానుని కిరణాల
ఒడిసిపట్టుకుంటూ
పుడమికి నిరంతర జీవాన్ని అద్దుతూ జీవనాన నిలుపుతోంది పచ్చదనం...
పచ్చగా అల్లుకున్న పూలతీగ
ముంగిట పూజలందుకునే
తులసీ మాత శుభప్రదంగా
ఇంటిల్లిపాదినీ కాపాడుతుంది...
సృష్టిలోని పచ్చదనమే
మానవాళికి ఊపిరై
మనుగడలో అడుగడుగునా
తోడై నడిపిస్తోంది.....
అన్నపూర్ణ సకలజీవుల
అవసరాలను తీర్చె
హరితవనాలను కాపాడుకోవడం
మన ఉనికిని నిలుపుకోవడం
ప్రతీ ఒక్కరి బాధ్యత......!
అనూశ్రీ
Comments
Post a Comment