కోయిలమ్మ - మమత ఐల
కవిత సంఖ్య:—71
అంశం:—కోయిలమ్మ - మమత ఐల
శీర్షిక:—పాటలరాణి
——————————————
మథుర గాయిని
పాటల రాణి
కోయిల వాణి
వన్నె నలుపైనా
కాకి రూపైనా
గలం తేనే
అమృత గానం ఎవరికున్నా
పోలిక పోలుస్తారు నిన్నే
వసంతం వెల్లివిరిసిన వేల
చల్లగాలిలో పిల్లవాయుల మద్య
కోయిలరాగం పంచామృతంవలె
నీ కువకువలు జనులనాకర్షింపగా
ఆ..సమయాన్ని
సంగీత మథువనిలో
తేలిపోతున్నట్లు
జనసమూహమంతా
నీ మథురగానానికి ముగ్దులై
పరవసించి నీతోపాటు
కుహు - అంటే - కుహు అని
నీ గొతుంలో గొంతు కలిపి
పాడిస్తావు
సంగీత స్వరబానివి నువ్వే
పాటల మహరాణివి నువ్వే
Comments
Post a Comment