కోకిలమ్మ - వెగ్గలం ఉషఃశ్రీ


అంశం ~ కోకిలమ్మ  -  వెగ్గలం ఉషఃశ్రీ

శీర్షిక ~🌷 నిశ్శబ్ద విరహ గీతం🌷

పుడమికి సొగసులద్దగ ఏతెంచిన వయ్యారి వసంతంతో జతై వచ్చిన కోయిలమ్మ...

గున్న మామిడి తోటల్లోన లే చిగుళ్ళను కడుపారా భజించి జతకై చేసే కుహూ కుహూ రాగాల కచేరితో దాగుడుమూతలాడుతూ...

కుహూ అన్న కొంటె కోణంగికి కుహూ అని గడుసు సమాధానమిస్తూ...

వేసవిని ఆహ్లాదభరితం చేస్తూ మనందరి మది దోచి తీయని గానానికి తన పేరునే బహుమతినొసగినది!

మరి నేడు...
కాలం మారి ఎండలు జ్వలిస్తుంటే...
గున్న మావిల్ల తోపులన్నీ ఎండుటాకుల గలగలల సవ్వడి చేస్తుంటే...

ఆకలి దప్పులు తీరని గండు కోయిలలిక మౌనవ్రతమునాచరిస్తూ...
నిశ్శబ్ద విరహ గీతాలాలపిస్తున్నవి!

Comments