కోకిలమ్మ - అన్నాప్రగడ వేంకట నరసింహారావు..
సంఖ్య..233
అంశం.కోకిలమ్మ - అన్నాప్రగడ వేంకట నరసింహారావు..
శీర్షిక..గానామృతం
వసంతరుతువు ఆగమన సమయాన..
అవనికి ఆమని సందేశం అందువేళ..
రెమ్మలు తొడిగిన కొమ్మల మధ్య ఎవరో చిగురులు మేయుచున్నట్టుంది..
మానులు పిందెలతో నిండుగా కనిపిస్తుంటే,గిరగిరా భ్రమరాలు తిరుగుతుంటే కుహు కుహు మంటూ ఎవరో గానంచేస్తున్నట్టుంది..
ఆ గానం అమృతం చిలికిస్తున్నట్టుగా, నల్లనయ్య పిల్లనగ్రోవి వూదుతున్నట్టుగా సుమధురంగా ఉంది..
ఆ గానామృతం అందించు జీవికి నిలువ నీడలేదేమో కాకమ్మ గూళ్లను అద్దెకు తీసుకుంటూన్నాయి..
అంతటి గొప్ప కళాకారిణికి శాఖాహార, మాంసాహార బేధము తేలియదేమో ఆహారంలో పండ్లతో పాటు, క్రిమికీటకాలను ఆస్వాదిస్తున్నాయి..
వింతైన ప్రపంచంలో ఎన్నో జీవరాసుల్లో గానామృతం అందించు కోకిలమ్ముకు కోటిదండాలు..
✒అన్నాప్రగడ
Comments
Post a Comment