కోయిలమ్మ - కటుకం కవిత


తేది:21/6/2019
అంశం: కోయిలమ్మ  -  కటుకం కవిత
కవిత సంఖ్య:236
కవిత శీర్షిక: కోయిలమ్మ గానం

పూలకు పరిమళం అందం
సెలయేటికి గలగల అందం
నెమలి నాట్యం అందం
నింగికి చుక్కలు అందం
నేలమ్మకు తరువులు అందం
ప్రకృతికి కోయిలమ్మ గానం అందం...!!

వసంతాగమనానికి
సుస్వరాల సంగీతకచేరీతో
స్వాగతగీతికలు ఆలపించగా ప్రకృతిమాత
పులకరించి పరవశించును
చైత్రమాసానికి ఆహ్వానం పలుకును...!!

మేను నలుపైనా
గానం అమృతం...
గున్నమామిడి తరువుపై పచ్చదనాల కొమ్మలమాటున లేలేతచివుళ్ళు తింటూ...
కుహుకుహూ అనే మధురస్వరంతో యావత్తు జగత్తును తన్మయత్వం నొందెలా చేసే కోయిలమ్మ గానానికి సరితూగేది మరొకటి లేదు ఇలలోన...!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి