కోకిలమ్మ - చిందం సునీత
తేది: 21/6/2019
అంశం: కోకిలమ్మ - చిందం సునీత
కవిత సంఖ్య: 176
కవిత శీర్షిక :కోకిల రాగాలు
పచ్చని చెట్ల మాటున
కోకిలమ్మ
మధురంగా తీయని
స్వరంతో
రాగాలతో రాగంతీస్తూ0టే
చైత్రమాసం
మావి చిగురుతో
కొత్త ఉత్సహపు ఆనందాన్ని
మనిషి గొంతుకలో
తనకు వంతపాడుతూ
సరిగమలెన్నో నేర్చుకొని
ఆమని కోయిలల రాగాలాలపిస్తూ
ఆనందరాగాలు అందించే
కోకిలమ్మ రాగమంటే
నా కెంతో ఇష్టం!!.
Comments
Post a Comment