కోకిలమ్మ - గీతాశ్రీ మెదక్
నేటికవిత@137
అంశం:కోకిలమ్మ - గీతాశ్రీ మెదక్
శీర్షిక:కోయిలగొంతు మూగబోయింది
~~~~~~
చైత్ర మాస వేదికకు శుభారంభము పలుకుతూ
వసంత ఆగమనానికి సుస్వరాలను ఆలపించు కోయిలమ్మ
నలుపు రంగున్ననేమి
సమస్తాన్ని తనగాత్రంతో అలరించు తీయని స్వనాలమేనా
ఆ మధురబాణీలకు ఉప్పొంగని మనసుందా
ఆ కుహు కుహూల కూజితాన్ని కోరని కర్ణముంటుందా...
అద్దె ఇంటిలో పెరిగినంత మాత్రాన
రంగులసామ్యతనే అదననుకోలేదు ఎప్పుడు
దేవుడు గీసినరాతని సర్దిచెప్పుకుంది
సరికొత్త పల్లవులందుకుని
విరహశిశిరాలను రాల్చుకున్న వనాలకు చెలిమిగీతమవుతుంది
పచ్చపచ్చని కొమ్మలచాటున
మత్తుగా మావిచిగురులు తింటూ
రాగాలుతీసే కోయిలగొంతు
నేడు మూగబోయింది ఎందుకో..
పచ్చికలేని నేల విలపిస్తున్నందుకో
మానవత్వపుతడి ఇగిరిపోయి మనిషి మరణిస్తున్నందుకో మరి
Comments
Post a Comment