కోకిలమ్మ - బి.సుధాకర్


సంఖ్య..295(21.6.2019)
అంశం..కోకిలమ్మ  -  బి.సుధాకర్
శీర్షిక..గాన మాధురి

చల్లని పిల్ల గాలులతో తనువు పులకరించే వేళ
తియ్యని రాగమొకటి తనవైపుకు పిలుస్తుంది
రంగుదేముందని రాగంతో తెలిపింది
మాట మంచిదైతే మనుషులంత ఒక్కటంది

కొమ్మల్లో దాగిన కోకిలమ్మ
వసంతాల వేడుకలో పసందైన పాటపాడె
పరవసించి మయూరి తన్మయించి ఆడింది
పాటవిన్న పసిపాప పకా పకా నవ్వింది
చెట్టుపైన పక్షులన్ని కోకిలను పొగిడినాయి

నల్లగా ఉన్న కోకిల
మెల్లగా కూస్తుంది ఎందుకల
చాటున ఉన్నా మాటువేసి పట్టినారు
బందించి బాధించి బలవంతంగా పాడించినారు
ప్రకృతి వదిలేసి పంజరంలో ఉంచినారు
కూయలేని కోకిలమ్మ ఎక్కి ఎక్కి ఏడ్చింది

కోకిలమ్మ పాటపాడి కోరికలే పెంచింది
ఆనందపు ఆశ పెంచి వినోదాలు తెచ్చింది
మధురమైన రాగాలతొ కదలకుండ చేసింది
శ్రావ్యమైన పాటలతో మనసులాగేసింది

Comments