కోకిలమ్మ - ఏడెల్లి రాములు


అంశం* కోకిలమ్మ  -  ఏడెల్లి రాములు
శీర్షిక* కోయిలా పాడవే హాయిగా

కోయిలా పాడవే హాయిగా
ఆమని నీ మణిహారమేగా
కోయిలా పాడవే హాయిగా

ఎన్నెన్నో రాగాలు పోతావు
చిన్నారుల గేయమై వస్తావు
పున్నమి వెన్నెలై పూస్తావు
చైత్రమై చిత్రాలు తెస్తావు

కోయిలా పాడవే హాయిగా//

శిశిరాన్ని మరిపిస్తావు
వసంతమై  కొమ్మల్లో వాలుతావు

పలుకు పలుకుల్లోనా గమకాలు పాడేవు
గానే కోకిలమ్మవై లోకమేలుతుంటవు

ఎంతెంతో రస మాధుర్యం
కవులకిది కమనీయ కావ్యం

జానపదుల జావళివై
ప్రేమికుల రసగుళికవై
ఆ నోటా ఈ నోటా ఆచ్చెరువొందిన పాట
గోదారి అలలపై పదనిసలైన జాలువారే
జలధార

కమ్మని కొత్త చిగుళ్లలో తీయని రాగమై
బావాల ఆరావళీ అందాల జాబిలి గీతమై
కునుకు కునుకు లో కువ కువలయ సంగీతం
నేరేడు మామిడి ఈత పాల పళ్ళలో
నీ తీయని రసమాధుర్యం

కోయిలా పాడవే హాయిగా
వేవేల బాల గొంతుకల తీరుగా

నీ పాటలో మధురిమలు
నీ వాలిన కొమ్మల్లో కొత్త ఊసులు
మా మనసంతా దోచుకున్న కోకిలమ్మా
మా మనసుపూల కొమ్మల్లో వాలవమ్మా

ఏడెల్లి రాములు
ది*21*06*2019(12*50)
ఎల్కలపెల్లి

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి