కోకిల - నల్లు. రమేష్


కవితా సంఖ్య:-144
అంశం:-వసంత కోకిల  -  నల్లు. రమేష్
శీర్షిక:-"తిరిగి రాని వసంతం"

"మబ్బులు లేని మిద్దె పైన
 ఓ జాబిల్లి ఉండేది
 కొన్ని నవ్వులు నాకై
 క్రిందకు ఒలికేది
 బిందెలు బిందెలుగా
 భుజాలపై
 భారం తెలియక మోసే వాణ్ణి

 ఉన్న పళంగా
 అక్కడో వనం వెలిసేది
 కోయిల రాగాలకు
 పందిర్లు వేసేది
 నా చుట్టూ వసంతం మొలిచేది
 బదులు కోసం
 రోజు రోజుకూ రాగాలు
 పొడిగించేది

 నన్ను చేరిన వసంతం
 శాశ్వతమన్న భ్రమలో నేను
 మైమరచి పోతున్నా..
 అంతలోనే మంచుతెరలా
 వసంతం కరిగిపోయింది

 మూగబోయిన రాగాలు
 చిగురిస్తాయని
 నేటికీ వసంతాలను
 జల్లెడ పడుతున్నా
 తిరిగి రాదని తెలిసి
 కవిగా మిగిలి పోతున్నా!

Comments