కోకిలమ్మ - ఉదయశ్రీ ప్రభాకర్
కవిత సంఖ్య.248
అంశం. కోకిలమ్మ - ఉదయశ్రీ ప్రభాకర్
కోకిలమ్మ రాగాలు
చూపులకు అందని అందాలేవో
మనసును చూరగొంటూ మురిపించగా
ఆనందాల విందు చేస్తుంది ప్రకృతి పాఠశాలలో మృదు రాగలతో కోయిలమ్మ
ఆమని తొంగి చూడగానే
తరువులు చిగురులు తొడగగానే
ప్రకృతి పులకరించింది పరవశాన
కోకిలమ్మ రాగాలు తీస్తుంది
ఆనందాలలో ఊయలలూగుతూ..
ఆకుల మాటున దాగి
తన రూపుతో కనువిందు చేయకున్నా
జల పాతాల సవ్వడులకు తన రాగాలు జత చేర్చి సంగీత కచేరి చేస్తుంది మురిపంగా
తన పాటలతో పంట చేలకు నాట్యం నేర్పితే
తన స్వరాలకు గిరులు వంత పాడగా
తన మధుర స్వరార్చనతో మురిపిస్తుంది..
పైరగాలిని వయ్యారంగా గంతులేయ మంటూ
జగతిన స్వరాలెన్ని ఉన్నా
నూతన స్వరాలెన్నో ఆనందాలలో మునకలేయించినా..
కోకిలమ్మ రాగాలకు వంత పాడని గొంతులుండవు కదా..
Comments
Post a Comment