కోకిలమ్మ - మిట్టపల్లి పరశురాములు
అంశం;కోకిలమ్మ - మిట్టపల్లి పరశురాములు
కవితసంఖ్య:259
శీర్షిక:తీయనిగానం
దివి:21-06-2019
***
చల్లగా మెల్లెగామెలికల!
ఒయ్యారాలపులకరింతల!!
అందాలు ఆరబోసుకొని!
ఆమనిఅరుదెంచినవేళ!!
కొమ్మరెమ్మల్లో కోటిస్వరాల!
గానామృతఝరిలో...
కోకిలమ్మ కుహుకహూన!
కూతకూసి రంజింపజేసింది!
పచ్చని పంటలకు ! వెచ్చనిజంటలకు !!
అదేపనిగాహాయినిచ్చి!!
నూతనోత్సాహామై...
ప్రకృతిమాతను ! పరవసింజేసింది !!
నల్లనిరూపున ! చల్లనిమనసున !!
యెల్లరియెదలను కదిలించే
నాదమైసునాదమై ...
చక్కనిచూపుల ! చిక్కనితలుపుల !!
మోదముకలిగించే !
ఆత్మీయనెచ్చలి !!
పాటలమాటల ఆటలతో!
ఝమ్మని కమ్మని స్వరములతో....
రా రమ్మని పిలిచెను రయముగను....
అందాలొలికే కోకిలగానము!
బుడిబుడినడకల!! హంసలకన్నా...
పంచవన్నెలా చిలకలకన్నా!
సుందరమయూరాలకన్నా!!
జుంటిధారలకన్నా !
కలకండతీపికన్నా !!
మధురాతిమధురమమ్మా! కోకిలానీకమ్మనిరాగమే !!!
మాయెదలనుఆనంద డోలికల్లోఓలలాడించి...
మైమరిపింపజేయునమ్మా!!
Comments
Post a Comment