కోయిల - ఐరేణి కృష్ణవేణి


అంశం:కోయిల -  ఐరేణి కృష్ణవేణి
శీర్షిక:వసంత రాణి
కవిత సంఖ్య:22


కుహు కుహు రాగాల కోయిలమ్మ!
వసంత ఋతువుకు రాణివమ్మా!!

విరుల పరిమళాలను ఆస్వాదిస్తూ..
ఝరులలో జలకాలాడుతూ..
లేత చిగుళ్ళను నెమరు వేస్తూ..
పచ్చని హరితాలను ముద్దాడుతూ..
వన విహార రాణివై.. కమ్మని నీ గాన మాధుర్యంతో  ప్రకృతిని పరవశింప చేస్తావు!

నీకు తోడు మా బడిలో బుడుతలు కూడా ఉన్నారు!
నీకు సరిజోడిగా కూతలు కూస్తూ, నిన్ను అనుకరిస్తూ ఉడికిస్తారు!
నీ రాగాల తీగలను వారి గొంతులో సవరించుకొని గాన కోకిలలై గంతులేస్తారు!

వనదేవతకు ముద్దు బిడ్డవు!
మానవాళిని నీ గొంతులోని తీయ్యటి రాగాలతో మేలుకొలుపే చైతన్య గీతానివీ!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి