కోకిలమ్మ- డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి

కోకిలమ్మ- డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
రచన:
కవిత సంఖ్య: 194
కవిత శీర్షిక:

      ఆమనీ ...కోయిలా...


వసంతకోయిల తనగానమాధురితో
ఎదఎదనూ పరవశింజేస్తుంది
ఆగి...ఆగి..కుహూ..కుహూ.మంటూ
సాగిపొమ్మంటుంది  సందేశాన్ని వింటూ .

ప్రకృతిని పులకరింపజేస్తూ
నవోత్తేజానికి ఊపిరిపోస్తూ
కొమ్మకొమ్మల్లో ప్రతిధ్వనిస్తూ
తన ఉనికి చాటుకుంటుంది

గున్నమామి కొమ్మలే తన ఆవాసం
లేలేతచివుళ్ళే తన కమ్మని ఆహారం
తీయతేనియ పాటకచేరీలే అనునిత్యం
ఆమని అందాలన్నీ తనవే అన్నది అక్షరసత్యం

ఒకోసారి కోయిలగొంతున కొసరేరాగాలు
గుండెలుకోసే తీయని సరాగాలౌతాయి
తెల్లారని రేయిలా ఎడారికోయిలలౌతాయి
దాహంతీరని  వానకోయిలలౌతాయి

ఛైత్రమాసం చైతన్యవంతమౌతుంది
మావికొమ్మ చిగుర్లూ కోయిలమ్మ కబుర్లూ
కవులకలాలలో గళాలలో చిందులేస్తాయి
వసంతం కవులసొంతం అనిపిస్తుంది

చక్రపాణి, అనకాపల్లి, విశాఖజిల్లా

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి