కోయిలమ్మ - గొర్రె రాజేందర్


చరవాణి : 9491487882
అంశం : కోయిలమ్మ  -  గొర్రె రాజేందర్
కవిత  సంఖ్య : (78)
కవితా శీర్షిక: నవతరం కోయిలమ్మ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

తనువు రూపు కన్నా
తనకున్న ప్రత్యేకతతో
జీవితంలో ఎదగాలనే ప్రేరణ కోయిలమ్మ

తన రూపం నలుపైనా స్వరం సుస్వరం
ఆత్మ విశ్వాసంతో అందలమెక్కి
గాన గంధర్వ స్వరంతో మధుర గానం
కుహు కుహు రాగాలు తీస్తూ
ఆబాల గోపాలన్ని ఆనందపరుస్తూ
ఆమని రాకకు పలుకును ఆహ్వానం
చల్లని వెన్నెల్లో విరాహాగ్ని భరిస్తూ
ప్రియునికై ఎదురు చూసే ప్రియురాలిలా
వసంతం కోసం పరితపిస్తూ
కోరికతో కోయిలమ్మ ఎదురు చూపులు
రాలిన ఆకుల వైపు చూస్తూ
నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా
కష్టాలు ఎదురైనప్పుడు కలత చెందవద్దని
కొత్త ఆశల చిగుర్లకై వేచి చూస్తే
కొంగ్రొత్త వసంతం దరి చేరుతుందని
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమిటని
సమాజానికి నవ సందేశాన్ని అందిస్తుంది

ప్రకృతి పాడవుతున్నా
పరిరక్షణకు పరిహారం ఆలోచింపక
మౌనంగా విషాద గీతికలు పాడుతున్న
మానవుని మనుగడ సాగేదెలా అని
కఠినపు ప్రశ్నలు సంధిస్తుంది కోయిలమ్మ

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి