కోకిలమ్మ - గజవెళ్ళి శ్రీనివాసాచారి


కవిత సంఖ్య: 235
అంశం: కోకిలమ్మ  -  గజవెళ్ళి శ్రీనివాసాచారి
శీర్షిక: కోకిలమ్మ కూజితాలు
...
కోకిలమ్మ గానం
అమృత భాండాగారమే
కోకిలమ్మ వర్ణం నలుపైనా
గానం మాత్రం సుమధురం

నేడు వినిపించవేమి
వసంత ఋతువులో
కోకిలమ్మ కూజితాలు

పల్లెల్లో పెరళ్ళు కనుమరుగు
మామిడి చెట్లు కరువు
కోకిలమ్మలు ఎగిరిపోయె
కరువయ్యె కుహు కుహు రాగాలు

మామిడి చివుళ్ళు ఆరగించి
మధుర గానం ఆలపించు కోకిలమ్మలు
ప్రకృతి సౌందర్యం
పక్షుల అందాలను తిలకించే
కోయిల స్వరాలను వినే
తీరికెక్కడిది నేటి జనానికి

ప్రకృతిని ప్రేమిద్దాం
పక్షి సంతతిని కాపాడుకుందాం
...

Comments