కోకిలమ్మ - భాస్కర బాలభారతి



అంశము  కోకిలమ్మ  -  భాస్కర బాలభారతి

శీర్షిక
వసంతాగమనము
కవిత. సంఖ్య 126

గూడుకట్టచేతగాని  కోకిలము
కాకమ్మగూటినే పుట్టిల్లుగా.
పురడోసుకోగా!!

తరతమబేధములెరుగని
కాకము తన అండాలతోసమంగా పొదిగీ 
 కూతలతేడాలతోనిర్థాక్షిణ్యంగా
  కిందకుతోసేయ 
తల్లిస్పర్శకూ పెంచిన మమకారానికీనోచుకోక
రెంటికీ చెడ్డరేవడులై   పిల్లకోకిలాలుతల్లడిలుతూ

ఆకలిదప్పులతో అలమటిస్తూ
వెంటాడే వైరిపక్షుల తప్పించుక
తిరుగుతూ
ఏఏటినీటిలోనో మోముజూచుకున్నాఏమో ??
కాకిలాగవుంటారని లోకులంటారనీ. ఏకొమ్మ
గుబురులమాటునో దాగిదాగి
కుహూ కుహూయని అమ్మకైఆలపిస్తాయి !!!
కొమ్మలరెమ్మల అమ్మ ఊయల ఊగూతూ
గున్నమావిగుబురుచిగురుల
మెక్కుతూ
ఎన్నటికీతిరిగిరాని అమ్మకైతపిస్తూ కుహూ కుహూ రాగాలుతీస్తుంటే?ు 

ఈడొచ్చిన గండుకోకిల తోడుకైతపిస్తూ తోటంతాతిరుగుతూ
పిల్లలజాడకై తల్లికోకిల
కాకమ్మల. గూళ్ళన్నీ వెదకుతూ
ఎలుగెత్తి కూస్తుంటే ?

వానిదీనాలాపనలు మనకు
మధురాలాపనలా !!
వానిఆగమనం.  మనకు వసంతాగమనమా !!

ఎంతవిచిత్రం!! ఎంతవిచిత్రం

Comments