కోకిలమ్మ - Yamsani Soumya

అంశం: కోకిలమ్మ
శీర్షిక:నీ పాట పంచామృతం

ఆకురాల్చిన తరువులకు  ఊపిరి పోస్తూ,
చిగురులు తొడిగిన వసంతపు చిన్ని చిన్ని అందాలతో ఆమని తడిసిపోగా,
కేరింతలతో భ్రమరాలు ఝుంఝుం నాదాలు చేయగా కొత్తచిగురు తొడిగిన చెట్టు కొమ్మ మాటున మదినిదోచే ఓ కొంటె రాగం కుహూ-కుహూ మంటుంది.

ఎంత వినినా తనివి తీరని రాగమది,
మనసును మైమరపించే మధురగానమది,
ఆమనినే పులకరింపజేసే బంగరు గొంతుకది,
తన మేని రంగుకు అందని అపురూపరాగమది.

చైత్రమాసపు వెలుగులో ప్రకృతి అందాలకు సొబగులద్దుతూ కడు రమణీయంగా కూస్తుంది ఆ కోకిలమ్మ,
పల్లెతల్లి ఎదలో ఒదిగే బంగరుబొమ్మ..

పిల్లల అల్లరి మాయం చేస్తూ
సాగే ఆ గీతం,
మరల మరల వినాలని కర్ణములు తాపత్రయపడగా,
కవుల కలములకు సువర్ణవస్తువై విరాజిల్లుతూ,
మధురగానానికి చిరునామాగా తన నామమే నిలుపుతూ

తెలుగు సంవత్సరాధిని తన సరిగమల స్వరాలతో ఆహ్వానిస్తూ,
కొమ్మ చాటు కోకిలమ్మ కుహూకుహూ మని ఆలపిస్తూ ఉంటుంది.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి