కోకిలమ్మ Vittala Sreekantha Sharma

అంశం.కోకిలమ్మ
కవితసంఖ్య260
శీర్షిక.పంచమస్వరం
తేది.21-06-2019
**********
సంగీతంలో పంచమస్వర ఉద్గమస్థానమిచ్ఛి
వసంతాగమ స్వాగతసూచక
బాధ్యతనిచ్ఛి..
ప్రకృతిశోభను ఇనుమడింపచేసే గౌరవమిచ్చినవాడు
ఎంతోపెద్దలోటు ఒకటిపెట్టి
సంసారానందానికిదూరంచేశాడు
కాకులగూళ్ళలోగుడ్లుపెట్టించి
పొదగటంచేతకానితనాన్ని
అంటగట్టి బాధ్యతారాహిత్యాన్నిబిరుదుగాఇచ్చి కాకులకంటే కడహీనం
చేసినాడు.
పంచమస్వరం సంగీతమా
సంతానంకోసంపిలిచే ఆర్తిగీతమా...
వసంతరుతుశోభనుఎలిగెత్తిచాటేకుహూస్వనానికి ఈవికృతవర్ణ రూపమేమి...
కాకికీ కోకిలకూఒకే రంగేమిటి
ఏమోసృష్టిరహస్యం..అంతుబట్టదు.
మావిచిగుళ్ళుమేసినా
మాధవమాసాన్నిమోసినా
స్వంతసంతానాన్నిలాలించే
తృప్తిలేదుకదా...!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి