కోయిలమ్మ - డా॥బండారి సుజాత
అంశం: కోయిలమ్మ - డా॥బండారి సుజాత
శీర్షిక: రాగాల రాయంచ
కవిత సంఖ్య:220
తేది: 21- 06- 2019
కాకమ్మ గూటిలో పురుడు పోసుకొని దాగని వన్నె ,చిన్నెలతో ఎదుగుతూ
కాకమ్మ కణికరానికి దూరమయ్యే అనురాగాల
ఆమని కోకిలమ్మ
వసంతాల వేదికకు వందనాలందించుతూ
కుహు ,కుహూ రాగాలతో
కుతూహల మందించు
కోకిలమ్మ
మావిచివుర్ల మలయమారుతంలో మది
ఆనందానికి అందలం కోకిలమ్మ
ఆకుపచ్చని సోయగాలలో
అందాల ఆమనిలో తేనెలొలుకు తీయందనాల
రాగాల రస వల్లరి
వినబడిన కోయిల కూతతో
చూడాలన్న ఆత్రుతను
అణచుకోలేక ,తలఎత్తి చెట్ల
గుబుర్లలో వెతికినా కనబడని
రాగాలతో దోబూచులాడే
మధుర కంఠపు మాల కోకిలమ్మ
ఇద్దరమ్మల ప్రేమకు నోచుకోకున్న నిరాశ నిస్ప్రహలకు లోను కాకుండ
తనదైన మార్గం లో ఎదిగే
కోకిలమ్మ జీవితం మనందరికి ఆదర్శం
Comments
Post a Comment